←అన్ని కీర్తనలు · All SongsHymn #130 of 763
Font size:
130
క్రైస్తవులారా లేవండి
Kraistavulaaraa Laevandi
Christians awake, salute the happy morn
జాన్ బైరన్ (అను: బర్నార్డ్ లూకాస్)
John Byrom (Anu: Bernard Lucas)
చరణం 1
క్రైస్తవులారా! లేవండి ఈనాడు క్రీస్తు పుట్టెనంచు పాడుడి ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆసక్తిపరులై కీర్తించుడి సువార్త నేను ఎరిగింతును క్రీస్తును మానవాళితోడను నశింపవచ్చెనంచు పాడుడి.
చరణం 2
దేవుని దూత గొల్లవారికి ఈ రీతిగాను ప్రకటించెను: 'ఈ వేళ మహా సంతోషంబగు దావీదు పట్టణమునందు ఈ దినము దైవరక్షకుడు జన్మించెను.'
చరణం 3
త్వరగానే ఆకాశ సైన్యము హర్షించుచు నీలాగు పాడెను 'సర్వోన్నతాకాశంబునందుండు సర్వేశ్వరునికి ప్రభావము నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింపనియ్యుడి'.