FaithWalk
← Back to Library

#122క్రీస్తుని మహిమ

Author: తిరుకోవళ్లూరి స్టీవెన్Composer/Ragam: మధ్యమావతిCategory: సాయంతనారాధన
ప
లాలీ లాలీ లాలీ లాలమ్మ లాలీ – లాలీయని పాడరే బాలయేసునకు ||లాలీ||
1.
పరలోక దేవుని తనయుడో యమ్మ – పుడమిపై బాలుడుగా బుట్టెనో యమ్మ ||లాలీ||
2.
ఇహపరాదుల కర్త యీతడో యమ్మ – మహిపాలనము చేయు మహితాత్ముడో యమ్మ ||లాలీ||
3.
ఆద్యంతములు లేని దేవుడో యమ్మ – ఆదాము దోషమును గడుగ బుట్టెనమ్మ ||లాలీ||
4.
యూదులకు రాజుగా బుట్టెనో యమ్మ – యూదులతనితోడ వాదించి రమ్మ ||లాలీ||
5.
నర గొర్రెల మంద కాపరో యమ్మ – గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మ ||లాలీ||