FaithWalk
← Back to Library

#121యేసుని జననము

Author: కొమ్ము కృపComposer/Ragam: ముఖారిCategory: సాయంతనారాధన
ప
శ్రీ యేసుండు జన్మించె రేయిలో – నేడు – పాయక బేత్లెహేమ యూరులో ||శ్రీ యేసు||
1.
కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలను నామమందున ||శ్రీ యేసు||
2.
సత్రమందున పశువుల శాలయందున దైవ పుత్రుడు మనుజుడాయె నందున ||శ్రీ యేసు||
3.
పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పసుల తొట్టిలోన బరుండబెట్టబడి ||శ్రీ యేసు||
4.
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా – తెల్పె గొప్ప వార్త దూత చల్లగా ||శ్రీ యేసు||
5.
మన కొరకొక్క శిశువు పుట్టెను – ధరను మన దోషములు పోగొట్టను ||శ్రీ యేసు||
6.
పరలోకపు సైన్యంబు గూడెను – మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసు||
7.
అక్షయుండగు యేసు వచ్చెను – మనకు రక్షణంబు సిద్ధపరచెను ||శ్రీ యేసు||