#12యెహోవా దేవుని స్తుతి (103వ దావీదు కీర్తన)
Author: ముంగమూరి దేవదాసుComposer/Ragam: ఆనందభైరవిCategory: దైవారాధన — దైవస్తుతి
1.
జీవమా యెహోవా నీకు జేసిన
మేళ్లను మరవకు నీవు చేసిన పాతకంబులను
మన్నించి జబ్బు లేమియు లేకుండ జేయును
ఆ కారణముచే ॥దేవ॥
2.
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను
కృపను జీవ కిరీటముగ వేయును నీ
శిరసుమీద జీవ కిరీటముగ వేయును
ఆ కారణముచే ॥దేవ॥
3.
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగా మేలు తినిపిచ్చి
నీదు భావమును సంతుష్టిపరచునుగా
ఆ కారణముచే ॥దేవ॥
4.
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు
న్యాయమిచ్చున్ విభుండు మార్గము తెలియజెప్పి
మోషేకు దన కార్యములను విప్పెను
ఇశ్రాయేలు జనమునకు ఆ कारणముచే ॥దేవ॥
5.
అత్యధిక ప్రేమ స్వరూపియైన దీర్ఘ
శాంతుడు నిత్యము వ్యాజ్యము చేయడు
ఆ కడు కృపోన్నతుడు నీ పేరు నెప్పుడు
కోపముంచడు ఆ కారణముచే ॥దేవ॥
6.
పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబులు
పంపలేదు భూమి కన్న ఆకాశంబున్న
యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులందున
ఆ కారణముచే ॥దేవ॥
7.
పడమటికి దూరేంత యెడమో పాపములకును
మనకు నంత యెడము కలుగజేసియున్నాడు
మన పాపములను ఎడముగానే చేసియున్నాడు
ఆ కారణముచే ॥దేవ॥
8.
కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా
భక్తిపరుల యెడల జాలి పడును దేవుడు
తన భక్తిపరుల యెడల జాలి పడును దేవుడు
ఆ కారణముచే ॥దేవ॥
9.
మనము నిర్మితమైన రీతి తనకు దెలిసియున్న
సంగతి మనము మంటివారమంచును
జ్ఞాపకముచేసి కొనుచు కరుణ చూపుచుండును
ఆ కారణముచే ॥దేవ॥
10.
పూసి గాలి వీవ నెగిరి పోయి బసను
తెలియని వన వాస పుష్పము వలెనే
నరుడుండు నరుని ఆయువు తృణ ప్రాయము
మన దేవ కృప మెండు ఆ కారణముచే ॥దేవ॥
11.
పరమ దేవ నిబంధన నాజ్ఞలు భక్తితో గైకొను
జనులకు నిరతమును కృప నిలిచి యుండును
యెహోవా నీతి తరములు పిల్లలకునుండును
ఆ కారణముచే ॥దేవ॥