#11దేవుని వైపు చూచుట
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: ఖమాస్Category: దైవారాధన — దైవస్తుతి
ప
చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను
జాచుచు కరములు చక్కగా నీ వైపు ॥చూచుచు॥
1.
మేమమరులమై యుంటిమి మార్గము వీడి
మేము మందరము పోతిమి ప్రేమచే నప్పుడు
ప్రియ తనయు నంపించి క్షేమమార్గము
మాకు బ్రేమను జూపితివి ॥చూచుచు॥
2.
నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా
నీ శరణు జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు నీ జగతిలో
నగుచు గనపరుచుచుందువు ఘనమైన నీ కృపన్ ॥చూచుచు॥
3.
నీ భయము మా యెదలను నిలుపుము నీదు
ప్రాభవమొనరంగను నీ భయముచే మేము
వైభవ మొందుచు నే భయము లేకుండ
నీ భువిని గొన్నాళ్లు ॥చూచుచు॥
4.
దయచూసి మమ్ము నెప్పుడు మంచివి యన్ని
దయచేయు మెల్లప్పుడు దయచేయ రావిక
దయచేయుమని కోర దయజూపి మన్నించు
దయగల మా తండ్రి ॥చూచుచు॥