#86యేసునకు ఏమి సమర్పింతును?
Author: పులిపాక జగన్నాథముCategory: సాయంతనారాధన
ప
ఏమి నేను సమర్పింతు – యేసూ – యెట్లు నిన్ను స్తుతియింతు
ఏమి సమర్పింతు – హీనుడనగు నేను – కామితార్థములు ఎల్ల – కలుగజేయు నీకు ||ఏమి||
1.
నీ యందే ఆనందమొందగా – యేసు – నీదైన ఆత్మ నాకు అందగా – చేయుమంచు నీకు జేసెద ప్రార్థన – నాయందు దయచేసి – నా మనవి లాలించు ||ఏమి||
2.
నేను చేసిన అపరాధముల్ ఎల్లను – కర్త – నీ యెదుట దలంచుకొందును – నేను సిగ్గునొంది – నిజముగ కుందుచు – నేను వేడుకొందు – నీ క్షమాపణ కొరకు ||ఏమి||
3.
నన్ను నీవు స్థిరపరచుము – కర్త – యెన్నిట నన్ను బలపరచుము – తిన్నని మార్గమున – దృఢముగా నేగుచు – నిన్ను నేను స్తుతియింతు – నిండుగ నెల్లప్పుడు ||ఏమి||