FaithWalk
← Back to Library

#85క్రీస్తును కొలుచుట

Author: కాజా అనంతముCategory: సాయంతనారాధన
ప
చేరి కొలవండి – క్రీస్తుని పాదములు – చేరి కొలవండి చేరి కొలవండి – స్థిర మతితో మీ – నోరు నిండ మది – కోరిక తీర ||చేరి||
1.
సత్ప్ర చరిత్రతో – దారుణ పాతక – నిపుణుడు శుద్ధ – చారుండతడని ||చేరి||
2.
దేవుని కుమారుడు – ధీవిస్తారుడు – సేవ కావనుడు క్షేమకరుడని ||చేరి||
3.
యేసుని వారల – నిశీధమున మన్నన – చేసి తప్పు క్షమ – చేయును గాన ||చేరి||
4.
మరణము నొందిన – నరులను గృపతో – గ్రమ్మర బ్రతికించిన – మహిమోజ్వలుని ||చేరి||
5.
పలు దయ్యంబుల – బారదోలి రో – గుల రక్షించిన – మలినాపహుని ||చేరి||
6.
జను లాశ్చర్యమొంద – మూగకు నో – రును గన్నుల వింత – కు నడిపిన వాడని ||చేరి||