FaithWalk
← Back to Library

#612దైవాశీర్వాదము

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: పంతువరాళిCategory: క్రైస్తవ కుటుంబము
ప
కలుగునుగాక – దేవా – కలుగునుగాక – కలుగునుగాక మా ఇలలో నిప్పుడు – విలువ లేని దయ – గల నీ దీవెన || కలుగును ||
1.
తనయుని కరుణయును – దండ్రి దేవు దయ – తనరు నాత్మ కృప తప్పక మాకును || కలుగును ||
2.
మనమున భక్తులు – మరువక యైక్యము – ఘనముగా బెంపగా – ఘన సహాయము || కలుగును ||
3.
ఇట్టి యైక్యమును – యేసునితో మరి – గట్టిగా పెంచిన – ఘన సౌఖ్యంబు || కలుగును ||