#610ఆశీర్వచనములు – ఆరాధన ముగింపు
Author: మొలతాటి విద్యానందముComposer/Ragam: భీంప్లాస్Category: క్రైస్తవ కుటుంబము
ప
ప్రభువా మమ్మును దీవించి పంపుము – నీ కృప నందించి అభినందనములు జేకొనుమా – విభవము మహిమోనతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ || ప్రభువా ||
1.
పగతుర ప్రేమించెడు శక్తినన్ – తగ పొరుగును ఎంచెడి రక్తినన్ మిగుల దయచేయుము దైవ – జగదేక కుమార కీర్తి – యుగయుగములకు నీకగుతన్ || ప్రభువా ||
2.
గుడిలో వినిన నీ వాక్యము మా – గుండెల భద్రము చేయునట్లు గుడి త్రోవయందు నా చారములో – నడువగ తోడ్పడు మో కీర్తి యుగయుగములకు నీకగుతన్ || ప్రభువా ||
3.
క్రైస్తవ మైత్రిని సంఘములో – విస్తరణము చేయనిమ్ము నేస్తవ భావము లోకములో – నెరపగా దయగనుమో కీర్తి యుగయుగములకు నీకగుతన్ || ప్రభువా ||