#604వీడ్కోలు – ప్రభువు మీతో నుండుగాక
Author: ఎ. చార్లెస్ కిన్సింగర్Composer/Ragam: తిలంగ్ మోద్ (ఛాయ: యేసునాథకథా)Category: క్రైస్తవ కుటుంబము
ప
దైవప్రేమ మనల నెప్పుడు బంధించుగా – దివిని భువిని దీన జనులను స్థిరముగా కాపాడుగా ||
1.
పరమతండ్రి గద్దెముందట ప్రార్థనలు మరిచేతుము – పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా || దైవ ||
2.
నిత్య ప్రభువు సత్య సేవను నిరతమును మదినుంతుము – నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా || దైవ ||
3.
మనము విడిచి వెళ్ళునప్పుడు మదిని కలుగును వేదన – మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదము మెచ్చటొ || దైవ ||
4.
జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు – ఆదినుండి యిప్పుడు నెప్పుడు నవని పరమున జెల్లు గా || దైవ ||