FaithWalk
← Back to Library

#605వీడ్కోలు శుభములు

Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: శంకరాభరణముCategory: క్రైస్తవ కుటుంబము
ప
స్తోత్రము సేయరే – సోదరులార మన – యాత్మలతో తండ్రిని – ధాత్రిని మన పర – మాత్ముని వాక్కులు – స్తోత్రములో గలిపి || స్తోత్రము ||
1.
ఇచ్చట ప్రేమల – కిదియే కడవరి – వచ్చినట్టి దేమో అచ్చట మన మందిరమున్ గలిసికొని యా నందింతుముగా || స్తోత్రము ||
2.
ఎక్కువ ప్రేమలు – చక్కని స్తోత్రము – లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు – దేవుని గడుదుము – ఒక్క మనసుతోను || స్తోత్రము ||
3.
కన్నీరుండదు – చావు కష్టము – లేనన్నటికి ఉండవుగా కన్నను మన శృం – గారపు బ్రతుకు – లెన్నడరము కాదు || స్తోత్రము ||
4.
వాగును వీణెలు – సాగును పాటలు – సతతముగా నచట రాగము లెంతో – రమ్యమై యుండును – బాగింతన లేము || స్తోత్రము ||
5.
మరల నిచ్చట గూడుదమో లేదో – మన మందరము త్వరలోనే పర – లోకపు తండ్రి – తోడ నుందు మేమో || స్తోత్రము ||
6.
గొఱ్ఱెపిల్ల రక్తము – విలువకచ్చట – గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను – కూర్మితో ఏతుముగా || స్తోత్రము ||
7.
పరమ తండ్రితో – ప్రభుయేసునితో – పరిశుద్ధాత్మనితో స్థిరముగనుందుము – మరి దూతలతో – బరలోకమునందున్ || స్తోత్రము ||