FaithWalk
← Back to Library

#589స్త్రీల సమాజములు – బైబిలు స్త్రీల సేవ

Author: మల్లెల దావీదుComposer/Ragam: తోడి (ఛాయ: ఘన దేవుని తనయుండ)Category: క్రైస్తవ కుటుంబము
ప
మన దేశంబున క్రీస్తు – సువార్త వ్యాపించుటకు – మార్గంబు స్త్రీలంచు – మరువకమ్మ – పనిబూని ప్రభుకొరకు – పరదేశంబులయందు – ఘనురాండ్రు చేయు పనుల్ – వినలేదమ్మా? ||
1.
సాటియైనటువంటి – సాయం బై పతికి – లోటులేకుండ నెప్పుడు – లోబడుమమ్మ – పాటుపడి నీ సుతుల – భయ భక్తులతో పెంచి – నాటుము మదిలోన బోధ – నమ్మకమమ్మ ||
2.
అన్నపానములందు నలవాటులందు నీ – పనులకు మాదిరి – వగుదువమ్మ – నిన్ను నీ పనులు గమ – నించి పరిశీలించుచున్న వారింటి బయట – నున్నారవమ్మ ||
3.
ఘనుడౌ దేవుని వాక్య – మును చదివియు వినియు – దిన మేకాంతముగ ప్రార్థించుమమ్మ – నిన్నువలెను నీ పొరుగు – నెలతలను ప్రేమింపవలె – వినుము దూషింపక దీ – వించుమమ్మ ||
4.
పనులెన్నో నీ కున్న – ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరి కైన – దెల్పుమమ్మ – ఒనరంగ నేడాది – కొక్క యాత్మనైన నిక – నెనరుతో రక్షింప నేర్చుకొమమ్మ ||
5.
ఎల్ల సేవకుల కొరకు – ఎల్లప్పుడు ప్రార్థింప – తల్లుల సమాజమునకు – చెల్లునమ్మ – పల్లెలో శుభవార్త – ప్రభవింపవలెనన్న – తల్లులే మంచి సా – ధనములమ్మ ||