FaithWalk
← Back to Library

#586మందిరార్పణము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: యదుకులకాంభోజి (ఛాయ: పైనమైయున్నాను)Category: క్రైస్తవ కుటుంబము
ప
యెహోవా నీ మహిమ స్తవము – యేసుని సుందర మందిరము – ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రైస్తవాళి తోడను – స్నేహ మమర నీ శిష్యులు నిపుడు – గేహమునకు భక్తిని జేరిరి నీ – బాహు బలముగా నప్పుడ దీవించుమ || యెహోవా ||
1.
ఆకాశము నీ సింహాసనమగు – నవని నీ యడుగుల పీఠముగా – సమరు దేవ నీ కెవ్వరు సాటి – నీ కొరకొక్క మందిరమొనరించుట – కీ కుంభినిలో – నేరికి శక్యము – ప్రాకటమై నను నీ సద్భక్తుల నీ హృదయముల నీ నికేతనంబులు || యెహోవా ||
2.
అందముగాను ఇందులో నిన్నా రాధించు ప్రియ భక్తుల – డెందములే నీ మందిరములు గా – ముందొనరించుచు – బొందుగ నెలను దిశలందునుండు నరుల బృందంబుల దేవు సమాధానములు విడి – సద్గతిని బొందుట కిందు రాను నీ వింక నొనరింపుము || యెహోవా ||
3.
పతితాత్ములైనట్టి నరుల – పాప రోగాదులకు మందు – వెదకువారి గృహమున నుండును – హితువగ క్రీస్తుండు గృహపతియై – ప్రతి పాపునకును – సతతంబును వాయి స్థితిని బిలుచును – వినయముతోడ ధన క్షత రక్త మహౌషధ మిడి ప్రోవను || యెహోవా ||
4.
ధారుణిలో దుర్మార్గుల – పేరైన గుడారంబులలో – జేరియుండు దాని కంటెను – పేరిమిగల యీ నీ సదనాంగణ – ద్వారపాలకత్వము మా కబ్బిన – భూరి భాగ్య పరి – పూర్ణులమై విస్తార శాంతి మది – సౌఖ్యమొందుదము || యెహోవా ||