#585ఆలయ ప్రతిష్ఠ
Author: సి. ఎం. రఫాయేలుComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: రండి యుత్సహించి)Category: క్రైస్తవ కుటుంబము
ప
ఈ గుడియందు ప్రవేశింపన్ – యేసుని బిలువగ రారండి – ఆయన రానిదె దీవెనలు – ఆశీర్వాదము లరుదగును || ఈ గుడి ||
1.
ఆకాశము మన దేవునికి – అత్యున్నత సింహాసనము – పాదములకు యీ – భూమియును – పీఠముగా నొప్పును సుమ్ము || ఈ గుడి ||
2.
ఆయన సన్నిధి కాంతియై యీ – ఆలయమంత నిండుకొనన్ – ఆయన యాత్మ సహాయమున – ఆరాధనలను జరుపుటకై || ఈ గుడి ||
3.
నిర్మలమైన సువార్తను బో – ధింపగ సాయము చేయుటకు – బోధకులైన సువార్తికులకు – బోధను నాటగ చేయుటకు || ఈ గుడి ||
4.
ప్రార్థన విశ్వాసాయుతమౌ – భక్తిని నేర్పెడి నిలయముగా – భక్తులు దేవుని సన్నిధిలో – బాగుగ స్థిరపడ జేయుటకు || ఈ గుడి ||
5.
ఈ పట్టణమున వెలుగుటకు – ఈ ప్రజలందరి రక్షణకు – ఈ గుడి యీ సభ బలపడుచు – సాగుచు వృద్ధి జెందుటకు || ఈ గుడి ||
6.
బాప్తిస్మము నిర్ధారణలు – ప్రభు భోజన సంస్కారములు – బాగుగ జరుగుచుండుటకు – భక్తిని పెంపొందించుటకు || ఈ గుడి ||
7.
తండ్రి కుమార శుద్ధాత్మకు – తావుగా నీ గుడియుండుటకు – త్రేకుని దీవెన వర్షములు – దీనిపై నిరతము కురియుగాక || ఈ గుడి ||