#579కృతజ్ఞతార్పణల పండుగ
Author: చెట్టి భానుమూర్తిComposer/Ragam: ముఖారిCategory: క్రైస్తవ కుటుంబము
ప
ఏది సఖుడా – ఏది నీ – మదిని జేసికొనిన ప్రతిని ఏది నీవొసంగు కాను – కిదియే తరుణమీయ రమ్ము || ఏది ||
1.
అన్న వస్త్రంబు లిచ్చి – యాలు బిడ్డలనుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి – యున్న నా కెదురు కాను || ఏది ||
2.
వ్యాధి బాధలొందినప్పుడు – శోధనంబు లదరినప్పుడు ఏది యెప్పుడవసరం బది – యొసంగి యాదరించితి || ఏది ||
3.
మనసు శాంతిలేక నీవు – మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి – కనికరించినట్టి ప్రభుని || ఏది ||
4.
పాపమందు పడినాడు – దాపుజేరి నిలుపలేదా? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేదా || ఏది ||
5.
ఏమి దాచినావో సఖుడా – ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న – నదియే నాకు వేనవేలు || ఏది ||