FaithWalk
← Back to Library

#580ప్రథమ ఫలములు

Author: బండారు సుజ్ఞానముComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: యేసుని ప్రేమను ఏమరకుము)Category: క్రైస్తవ కుటుంబము
ప
సార్వజగతికి సంరక్షకుడు – స్వామి యెహోవాయే గాద – ధారుణీ స్థలని ధనధాన్యములను – దొలి దానము – తనకీయగరాదా || సార్వ ||
1.
ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగా – ఆదర్శముగా మనకడి గారగా – ఆది సంభవుని కతి మోదంబున – సేద్యఫలంబులు – తెవలదా || సార్వ ||
2.
కానుకలీయ రమానితులారా – కన్యకుమారుని భజింపన్ – మానవ పునరుత్థాన మహిమలో – మన ప్రథమ ఫలంబతడేరా || సార్వ ||
3.
ఉభయజగాల సర్వోన్నతు డాయన – శుభకరుడన నొప్పును గాదె – प्रभुని పేర మీ పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు ఇటతేరే || సార్వ ||