#566The Voice That Breathed o'er Eden
Author: జాన్ కేబుల్– అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్Category: క్రైస్తవ కుటుంబము
1.
ఏదెన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు – వర్ధిల్లు నిప్పుడున్.
పవిత్ర కల్యాణంబున పదిలపరుచుచు – దైవ త్రిత్వంబు నేడున్ దీవింపవచ్చుదురు.
సంతాన వరమును – సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు.
ఆదామునకున్ దండ్రి – హవ్వనొసంగితి వాదరముగా నీవే నీ ధన్యున కిమ్ము.
నీ ఱెక్క క్రింద వీరిన్ – భరి గ్రహించుచు వైరి తంత్రంబునుండి – దూరంబు జేయుము.
ఈ రీతిన్ బ్రతికి యంత – క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి – భ రంగ జేయుమి.