#556We Are But Little Children
Author: సిసిల్ ఫ్రాన్సెస్ అలెగ్జాండర్– అనువాదం: బర్నార్డ్ లూకాస్Translator: బర్నార్డ్ లూకాస్Category: క్రైస్తవ కుటుంబము
1.
నేను బీద చిన్న పిల్లవాడను – నా బుద్ధి స్వల్పమైనది – నా దివ్య యేసు కొరకు – నేనేమి చేయగలను?
నిత్యంబు చిన్న పనులు – నేను చేయవచ్చును – నా చిన్న తప్పులన్నియు – నేను చక్క పెట్టవచ్చును.
మనస్సునందు కోపము – రాబోవునప్పుడు – నా కన్నులెఱ్ఱ చేయక – నేను ఓర్చుకొనవచ్చును.
నేను తిన్నగాను నడుచుచు – నలుగురితోడ మెలగుచు – ఇల్లంత వెలిగించుచు – నలరింపగలను.
నేను ఎంత చిన్న పిల్లనైనా – నాకుండు చిన్న బాధలకు – నా యేసుకై యుల్లాసమున్ – తాళి ప్రేమ స్తోత్రము నర్పింపగలను.