#549క్రీస్తునందు బాలలు ఒక్కటే
Author: సి. విజయ చార్లెస్Composer/Ragam: యదుకులకాంభోజి (ఛాయ: తనువు నాదిదిగో)Category: క్రైస్తవ కుటుంబము
ప
ఏ దేశస్థులమైన – ఏ జాతి మనదైన – యేసులో మన మొక్కటే – ఏకమై బాలల – మెల్లరమును తండ్రి – నెంతో స్తుతించుచు నెప్పుడు పాడుదము ||ఏ||
1.
పలు దేశములలోన పన్నుగా దేవుని – ప్రార్థించెడి బాలలం – పరమ తండ్రి మాలో – ప్రతివారి దీవించు – బహుగా నీ దినమనుచు – బ్రతిమాలి వేడుదము ||ఏ||
2.
బహు దేశములలోన – పలువిధములుగా ప్రాకెడి బాలలం – ప్రభుడే యేసుని కొరకే – ప్రపంచమంతటిని – బాగుచేయను మిగుల – ప్రయాసపడుదము ||ఏ||