#541మంచి సమరయుడు
Author: జి. జాన్ తాతయ్యComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: వినరె మనుజులారా క్రీస్తు డిలనుజేయు)Category: క్రైస్తవ కుటుంబము
ప
ఒక్క మనుజు – డెరూషలేమునుండి – యెరికో పట్టణమునకు – ముక్కువతో వెడలుచుండె – కొంత ధనముతో ||ఒక్క||
1.
మార్గమందు – దొంగలతని – పట్టి కొట్టి దోచుకొనిరి – మూర్ఛ బోవు నట్లు కొట్టి – విడిచి వెళ్ళిరి ||ఒక్క||
2.
అప్పుడు నొక్క యాజకుండు – వచ్చి చూచి ప్రక్కగాను – కపటముతో వెళ్ళె వాని నాదరింపక ||ఒక్క||
3.
వెనుక నొక్క లేవీయుండు – వచ్చి చూచి యోర్వ లేక – కన్నులార చూచి – పోయె కరుణలేకను ||ఒక్క||
4.
పదిలపడి సమరయుండు వచ్చి – బదిలముగా చూచి వాని – నాదరించె కరుణతోడ – భేదమెంచక ||ఒక్క||
5.
నూనె ద్రాక్షారసము పోసి – గాయములను గట్టి వాని – ఘనమగు వాహనముమీద – నూరు చేర్చెను ||ఒక్క||
6.
అటువలెను మనము కూడ – కష్టములలో నుండువారి – కష్టములను చూచి యాదరింపవలయును ||ఒక్క||