#50సాయం ప్రార్థన
Author: మాథ్యూ సమూయేలుComposer/Ragam: మధ్యమావతిCategory: సాయంతనారాధన
ప
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై
కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ॥దేవ॥
1.
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను చేసినన్
నేను నిద్రపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ॥దేవ॥
2.
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము
జీవ పునరుత్థానములో మహిమతో లేవమడియనడుపుము ॥దేవ॥
3.
నేను చీకటి నిద్రను రోయుచు దుర లేని దినంబునందు
మానకుండగ దూతలను గూడి చేయు గాన మెప్పుడగునో ॥దేవ॥