#407What a friend we have in jesus
Author: జోసెఫ్ మెడ్‌లికాట్ స్క్రైవెన్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ప్రీతిగల మన యేసుండెంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత
హత్తుకు ప్రేమించును
క్రీస్తునొద్ద మన భార
మంత నప్పగించినన్
శక్తిగల యేసుచేత
మోత లెల్ల వీడును.
నీతిగల మన యేసు
ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో వి
శ్రాంతి కలిగించెను భీతి నొందు పాపులైన చింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత
క్రొత్త గతి నీతురు.
దయగల మన యేసు
ప్రియమైన మిత్రుడు
మాయా లోకమందు నిజా
శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమ లాది
మోయరాని బాధలన్
జయ మొప్ప నేర్పి యేసు
స్థాయి వృద్ధిచేయును.
దారుణిలో యేసు గాక
వేరుగొప్ప మిత్రుడా? పరలోకమందు యేసే వీరుడై రక్షకుడు
నారకులా! కావ వేగన్
క్రూర హింస బొందెను
కరుణించి యిచ్చి ప్రతి ప్రార్థన నాలించును.