FaithWalk
← Back to Library

#408Jesus, Lover of my soul

Author: చార్లెస్ వెస్లీComposer/Ragam: అనువాదం: బి. నూతన్Translator: బి. నూతన్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసూ, యాత్మ ప్రియుడా నిన్ను నాశ్రయింతు లేవగ నె తరంగముల్ గాలివాన కొట్టంగ లోకబాధ లన్నిటన్ నన్ను దాచు రక్షకా రేపునకు నడుపుము నాదు యాత్మను బ్రోవుము. దిక్కు లేని యాత్మకు వేరే ప్రాపు లేదుగ ఒంటిగాను విడవక నన్ను నాదరించుమీ నిన్నే నమ్మి యుంటిని నీవే నా సహాయము కాపులేని నా తలన్ కాయుమా నీ నీడను. క్రీస్తు నిన్నే కోరుదున్ దొరుకు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమా స్వస్థపరచు రోగులన్ న్యాయ శుద్ధ నామము నీదే, నేను పాపిని నేను పాపపూర్ణుడున్ నీవు ప్రేమా రూపివి పాపమెల్ల మానవుగా నీదు ప్రేమ చాలును మానుపు నీళ్ళు నా యెడన్ శుద్ధి చేయుగా నిమ్ము నీవు బ్రతుకు ఊటవు త్రాగనిమ్ము నీ దరిన్ పుట్టి నాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమీ.