FaithWalk
← Back to Library

#402దేవుడే మన దిక్కు

Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: ఖరహరప్రియCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
దినదినముకు – దిక్కు నీవే – మా దేవుడా – మమ్ము కనిపెట్టి కాపాడు నెప్పుడు – కర్త వీవే కర్త వీవే || దినదినమునకు ||
1.
పనికిమాలిన వారము – పాపిష్ఠులము నీదు – కనికరమును ఈచి కృపతో – గావు మమ్ము గావు మమ్ము || దినదినమునకు ||
2.
పాపమైన లోకమైన పిశాచకమైన మమ్ము – బట్టి రక్షింప వచ్చిన – బ్రాపు నీవే ప్రాపు నీవే || దినదినమునకు ||
3.
కష్టములు – కాని శోధనలు మమ్ము – చుట్టుకొనగ నీ కృప నెంతో – చూపెదవే చూపెదవే || దినదినమునకు ||
4.
నిందలైన దెబ్బలైన – నీదు నామమున మేము – పొందబోవు కాలమందు తండ్రి వీవే తండ్రి వీవే || దినదినమునకు ||
5.
సత్యమైన వాక్యమిచ్చి – సారమును దెల్పి నీదు – నిత్యజీవ మార్గమందు – నిలిపితివే నిలిపితిве || దినదినమునకు ||
6.
ఆశగొల్పి యాత్మలో నాఖ్యానుభవ మొందించి నీకు – దాసులమై బ్రతుకునట్లు – ధైర్యమిమ్ము ధైర్యమిమ్ము || దినదినమునకు ||
7.
విశ్వాస నిరీక్షణ ప్రేమ – నింపుగా మాకు నీవు – శాశ్వతముగ బంపించుమీ – శ్రేష్ఠముగను శ్రేష్ఠముగను || దినదినమునకు ||