#400క్రైస్తవుల నిర్భయము
Author: UnknownComposer/Ragam: ముఖారి (చేయ: మన మొదటి తల్లిదండ్రులు)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు నాధుని సేవ – రిప్పుడు మాకబ్బెను – వెరవము వెరవము
యేసు దాసులతో – బొత్తు – భక్తి మా కమరెను – జడియము జడియము || యేసు ||
1.
లోక జ్ఞానములోని – లోతు దెలిసి మేము – లొంగము లొంగము – యేసు రాకడ కొరకు సంత – సించి యెల్లప్పు – డుండెద ముండెదము || యేసు ||
2.
దైవజనుల మని – ధైర్యముతో మేము – పల్కెదము పల్కెదము – పాప భారమంతయు యేసు – ప్రభున కప్పగించి – బ్రతుకుచు బ్రతుకుచు || యేసు ||
3.
శుభవార్తమానము – సొంపుగా నరులకు – జెప్పెదము చెప్పెదము – లోక వైభవములను – వాంఛింపక యేసుని – పల్కెదము పల్కెదము || యేసు ||
4.
నీతి కవచంబును – నెనరుతో ధరించి – నిలిచెదము నిలిచెదము – లోక భూతునకైన పి – శాచిని యెదిరించి – కట్టెదము కట్టెదము || యేసు ||
5.
శోకమొందక యేసు – రాకడ కాశించి – రంజిల్లుచుండెదము – దూత మూకలతో గూడి – మోద మొప్ప యేసుని – పొగడెదము పొగడెదము || యేసు ||