FaithWalk
← Back to Library

#398రేపటిని గూర్చి చింతింపకుము

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: నాథనామక్రియCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జీవమా చింతించకుండు – నిన్ను – గావ వచ్చిన యేసు కరుణామయుండు జీవమా చింతించి – కృతి మూర్ఛిలైన నీ – జీవముకు నమ్మి జేసెదవా – కావున నీ చింతా – క్రాంతము వెడలించు – దేవుడెహోవ నీ – దిక్కని నమ్మి || జీవమా ||
1.
గగన వీధిని బోవు – ఖగములు దున్నునా – తెగగోసి కొట్లలో – దాచునొకో – యగణిత పక్షుల – కాహార మియ్యంగ – బెగడెద వెందుకు – పెంచు నన్నతడు || జీవమా ||
2.
పక్షి వృక్షాదుల – పై నింత ప్రేమతో – భక్షణ ఇచ్చుచు – బాలింపగా – నక్షరములకంటె – హెచ్చుగ నన్నెంచి – యక్షయముగా నేలు – నల్పవిశ్వాసి || జీవమా ||
3.
మిస్రాయిం బాధల – మీర దొలగించి – యిస్రాయేలుకు – మన్నా – నియ్యలేదా – యాశ్రయమై నీదు – హస్తము విడువక – నీ శ్రమలను బాపి – నిన్నేలు నాతడు || జీవమా ||