#397దేవుడు తన పరిశుద్ధులను ఎన్నడు ఎడబాయడు
Author: పులిపాక జగన్నాధముComposer/Ragam: శంకరాభరణము (చేయ: మన మొదటి తల్లిదండ్రులు)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఎన్నడు నెడబాయ – నే కొలది విడనాడు – ననిన తండ్రి – నిరత – మన్ని బాధలయందు – నన్ని దుఃఖములందు – నన్ను బ్రోచు || ఎన్నడు ||
1.
పాపుల రక్షింప – ప్రాణమిచ్చిన యేసు – బ్రతికి యుండు – తన – ప్రాపు గోరినవారి – భారము తా మోసి – ప్రాపరై యుండు || ఎన్నడు ||
2.
ఎల్ల కాలంబుల – నేకరీతిగ నుండు – యేసునాధ – డాత – డెల్ల విశ్వాసుల – నెల్ల – వేళల దలచి – యేలుచుండు || ఎన్నడు ||
3.
తనవారి యక్కరలు – తా నెరిగి యున్నాడు – తప్పకుండ – నాత – డెనలేని దయబూని – వినువారి మనవులు – వేడ్కమీర || ఎన్నడు ||