FaithWalk
Font size:
365

లేలేమ్ము క్రైస్తవుడా

Laelaemmu Kraistavudaa

క్రైస్తవ యుద్ధ ప్రేరణము


శహన · ఆది · పురుషోత్తము చౌదరి

Shahana · Aadi · Purushottamu Choudary

పల్లవి

లేలేమ్ము క్రైస్తవుడా – నీలో మేల్కొని లేలేమ్ము క్రైస్తవుడా – నీలో మేల్కొని || లేలేమ్ము ||

చరణం 1

విడువకు యుద్ధము – నుడువకు కపటము – యెడయకుండ నీకడ – నుండును బాయడు || లేలేమ్ము ||

చరణం 2

విడువకు ధైర్యము – వదలకు కవచము – సదయుడు క్రీస్తుడు – సత్ఫల మిచ్చును || లేలేమ్ము ||

చరణం 3

బెదరకు మేరికి – వదలకు దారిని – నది యిది కానిది – యాత్మను బెట్టక || లేలేమ్ము ||

చరణం 4

ప్రార్థన సారము – వర్ధిల్ల గోరుము – సార్థక కాలము – వ్యర్థము చేయక || లేలేమ్ము ||

చరణం 5

భావములోనన్ – దేవుని ప్రేమలన్ – నీవది వేడుచు – నెమ్మది గూడుచు || లేలేమ్ము ||

చరణం 6

యేసుని సిలువ – నెదుట బెట్టుకో – మోసము నొందవు – యేసుని కాపున || లేలేమ్ము ||