FaithWalk
← Back to Library

#364నా ఆత్మా, మేలుకొమ్ము

Author: పంతగాని పరదేశిComposer/Ragam: ముఖారి (చేయ: యేసుక్రీస్తుని గొల్వరన్న)Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము
ప
నా యాత్మ! లెమ్ము! సన్నద్ధుడవు కమ్ము – నా రణము బూని – పాయక పోరవలెను నిజము – వేరు శరణంబుల – నయుచు శత్రువు – మేయత నిను పడన్ – ద్రోయన్ దెగించెను || నా యాత్మ ||
1.
వేచి ప్రార్థించి యుద్ధము సలుపు – వీరాకృతి బోరుము – వే జయము కలుగునని యెంచకుము – ఏడ్చుచున్ బ్రతిదిన – మేసటబోరుచు – యాచించి గురు స – హాయము బొందుము || నా యాత్మ ||
2.
జయము నొందితి నని తలంపకుము – సౌఖ్యమునకై స – మయమనుకొని క్షమించి కూర్చుండకుము – నియమిత మకుటము – నీ వొందువరకు – నిర్భర యుద్ధము – నిలువక నమ్ముము || నా యాత్మ ||
3.
పోరు పోరాడు నిను మరణము – దేవుని యొద్దన్ – జేరు దనుక వీడక రణము – శ్రీ రమ్యుని ది – వ్యా రామంబునన్ – జేరి సుఖింపగ – జేకొని నిను విను || నా యాత్మ ||