#331మారు మనసు పొందుట
Author: ఎ. కోటయ్యComposer/Ragam: ముఖారిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
మనసా వినవేమే – క్రీస్తుని – గని సేవింపవేమే – అనుదినమున నీ కాయువు క్షీణం – బగుచున్నది గదవే ॥మనసా॥
1.
చింతలేల నీకు – వర నీ – మంతుడుండు వరకు – చెంతను జేరక యెంతసేపు నీ – యంతట నుండెదవే ॥మనసా॥
2.
లోకాశలకును – నీవు – లోకువై యుండకుము – ఆకాశము నేలెడు మన ప్రభువును – ప్రాకటముగా నమ్ము ॥మనసా॥
3.
మాయా సంతలోన – జిక్కి – మాయమై పోయెదవు – కాయము స్థిరమని నమ్మకుమీ నీ – ప్రాయము దక్కదుగా ॥మనసా॥
4.
రక్షకాయని వేడు – నీవు – రక్షణకై వేడు – రక్షణ బొందుట కిదియే సమయము తత్క్షణమున వేడు ॥మనసా॥
5.
అందరమును గూడి – యేసుని – మందిరమున జేరి – పొందుగ క్రీస్తుని పొగడుచు బాడుచు – నందున జేరెదము ॥మనసా॥