#330పాపమును విసర్జించుట
Author: నెమ్మదిగా నుండు ॥ఖండింప॥Composer/Ragam: ముఖారి (ఛాయ: భయమును నొందకుము)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
ఖండింపవలెను – దుర్గుణములు – ఖండింపవలెను – ఖండింపవలెనే పాపముండ – నియ్యక యేసు – నుండ జేరి మన – గుండె పదిలము చేసి ॥ఖండింప॥
1.
అంధత్వమునను – రక్షణ మార్గ – మంద జేరకయు – నెందెందు చూచినా – సందేహము లేక పాప – మందు మునిగి నరలా – నందమొందక చెడిరి ॥ఖండంప॥
2.
ఎందుకీ భ్రమలు – నీ యందుండు – సంశయము వీడు – పొందుగ యేసు సం – బంధుడవై యున్న – నందమైన మోక్ష – మందు జేరుట కొరకై ॥ఖండింప॥
3.
బెదరక నీవు – సాతానుని – నెదిరింపవలెను – కుదురుగ నీ యేసు – చదరున జేరిన – వదరుబోతు లెల్లా – నెదురాడ లేరింక ॥ఖండింప॥
4.
ఆసింపబోకు – లోకభోగములు – మోసమై యుండు – వాసిగ యేసుని – దాసుడవైనట్టి – గాసి జెందక మోక్ష – దాసుడ వౌదువు ॥ఖండింప॥
5.
నమ్మి జీవించు – యేసుని యందు – నెమ్మది బొందు – రమ్ము యేసుని యొద్ద – సొమ్ము నీకున్నది – సమ్మతించి మదిని