#314దావీదు కీర్తన 51
Author: మతి ప్రియంబౌ నీకు ॥దేవా॥Composer/Ragam: శంకరాభరణముCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
దేవా! దీనపాపిని – ఓ పావన – గావుము కృపా బాహుళ్యము చేత ॥దేవా॥
1.
ఖలుడనౌ దేవా! నా నిలువెల్లా పాపమే – మలిసత్వమును బాపి – మాన్యు జేయవే తండ్రీ! ॥దేవా॥
2.
నీకు కేవలంబు – నీకే విరోధముగ – ప్రాకొని నే ఘోర – పాపము బొనర్చితినని ॥దేవా॥
3.
నాయతిక్రమమెప్పుడు – నా యెదుట నున్నది – నా యెదన భారంబై – నన్ను ద్రుంచుచున్నది ॥దేవా॥
4.
పాపములోనేయు – దుద్భవించినాడను – పాపములోనేగ – ర్భము దాల్చినది తల్లి ॥దేవా॥
5.
ఎదయందు సత్యంబే – యెడగోరుచుందువు – హృదయమునందు జ్ఞాన – మొదవ జేతువు నాకు ॥దేవా॥
6.
కలిగించు నాలో ని – ర్మల శుద్ధ హృదయంబు – నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ॥దేవా॥
7.
త్రోసివేయకు నన్ను – నీ సన్నిధినుండి – తీసివేయక యుంచు – మీ శుద్ధాత్మను నాలో ॥దేవా॥
8.
నీ రక్షణానంద – మో రక్షకా మరల – చేరదీసి యిచ్చి – స్థిరపరచు నా మనసు ॥దేవా॥
9.
కావవే కర్తార – కార్తాపరాధమునుండి – కావున నుత్సాహ – గానంబు జేసెద ॥దేవా॥
10.
प्रभुవా! నా నోరు నిన్ – ప్రస్తుతించుచు సదా – విభవముగా కొనియాడ – విప్పు నా పెదవులను ॥దేవా॥
11.
కోరువాడవు గావు – వారువ్యర్పణలు – కోరిన నర్పింతు – కోటి బలులు నీకు ॥దేవా॥
12.
విరిగిన మనసే నీ – విలసిత యర్పణము – అరయ నలిగిన హృదయ