#301రక్షణాహ్వానము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శ్రీరాగముCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
రారో జనులారా – వేగము గూడి – రారో ప్రియులారా – శాశ్వతమైన – ఘన రక్షణం జేర – సారాసారముల్ – సమ్మతిగా జూసి – ధీరత్వమున క్రీస్తు – జేరు దారి గోరి ॥రారో॥
1.
అనుమానము లన్ని – మీరు మాని – ఆద్యంతము లేని – కనికరము చేత – మనల రక్షింపను – ధన జీవము నిచ్చు – ఘనుని క్రీస్తుని గొల్వ ॥రారో॥
2.
మన పాపములన్ని – మోయను దే – వుని చేన బని బూని – మనుజావతారుడై – వినుట కద్భుతమైన – పను లెన్నో చేసి సి – లువను బడిన ఘనుని జేర ॥రారో॥
3.
పాపాత్ములగు వారి – భారము ద్రుంచు – బలుడైన యుపకారి – ఓపికతో దన – దాపున జేరిన వారి – శాపము తా మోసి – కాపాడు ఘనుని వేడ ॥రారో॥
4.
తన యాత్మకు కీడు – గల్గించెడు – ఘనత లెల్ల పాడు – తనువు నిత్యము గా – దని యభిమాన – మును వీడి మన క్రీ – స్తుని జడగతి జూడ ॥రారో॥
5.
సకలాంతర్యామి – నిరాకారు – డొక్కడే యంతట స్వామి – ప్రకటముగా మర్త్యు – లకు నెల్ల మధ్యస్థు – డొక్కడే క్రీస్తుడు సం – రక్షకుడై యిలకు వచ్చె ॥రారో॥