FaithWalk
← Back to Library

#294క్రీస్తుని గొప్పతనము

Author: ఎన్. డి. అబెల్Composer/Ragam: హిందూస్తానీ తోడిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
యేసునే సేవింప రండి – మోసపోకండి – ప్రభు – దోషములను బాపు నండి – పెద్ద ప్రభువుండీ ప్రభు ॥యేసునే॥
1.
దేవు డీతడే సుమండీ – దిగులుపడకండీ – మన – చావు నొంది లేచెనండీ – జీవ మిత్రుడండీ ప్రభు ॥యేసునే॥
2.
పాపులను ప్రేమించెనండీ – ప్రాణ మిచ్చెనండీ – ప్రభు – దాపు జేరి వేడ రండి – దయామయుడండీ ప్రభు ॥యేసునే॥
3.
నరకబాధ నొందెనండీ – నరుల కొరకండీ – ప్రభు – దురితములను బాపు నండి – దుఃఖపడకండీ ప్రభు ॥యేసునే॥