#282ప్రభు భోజనమునకు ఆహ్వానము
Author: ॥మన యేసు॥Composer/Ragam: భైరవి (ఛాయ: పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ యని)Category: ప్రభు రాత్రి భోజనము
ప
మన యేసు మరణ స్మరణ విందు లో – బాలు గొనరండి ప్రియులారా – వినయ మానసులై – మన దోషచయమెల్లా – దనమను ధరియించు – కొని మనల గావ నాయన పడిన శ్రమలెంచి ॥మన యేసు॥
1.
మరల మన మధ్య కాల – పరమాత్ముండరుదెంచ – వరకాయమును మనము – మరవకుండుటకై – స్థిర భక్తి నదాని – జరిగింపవలెనంచు – గురుతరంబగు నాజ్ఞ – నేర్పితా జనెగాన ॥మన యేసు॥
2.
తినుడట యిది నా దివ్య – తనువంచు నొక రొట్టె – యను ద్రెంచి ప్రభుడిచ్చె – ననుబంధుతతికి – ఘన శ్రద్ధ దాన్ని గై – కొని మనము – భుజియింప నొన గూడు చిరజీవ – మనము మానమింక నె ల ॥మన యేసు॥
3.
ఆ రీతి నిజరక్త – ధారయై వెలయు ద్రా – క్షారసము నిచ్చె నిం – పార గొను డనుచు – గోరి యా మధురధార – గ్రోలిన మనకును క – దారమౌ జీవంపు ధార లుద్భవ మొందు ॥మన యేసు॥
4.
ప్రభు భుక్తి నెవడు దై – వభయంబు లేక యను – భవించు వానికి – శుభమౌ నా మీడ – విభవంబు దొలగురో – గభయంబు చేకూరు – శుభమవాసినికి నెప్పుడు – లభియింపదని తెలిసి ॥మన యేసు॥
5.
మిమ్ము మీరు తగు రీతి – గమనించి పరిశోధ – నము చేసికొని మీ పాపము లొప్పుకొనుచు – నమితార్తి పశ్చాత్తా – పముంబొంది యీ విందు – క్రమము బాటించి క్ష – మము మీకు సిద్ధించు ॥మన యేసు॥
6.
దురితాంధకార భా – స్కరుడు సద్గురుడేసు – పరమవిందున కిది యను – ప్రాసంబని యెరిగి – ఉరణ శాబక రక్త – సరిదంతో పరిపూతాం