#281నూతన నిబంధన విందు
Author: మార్తాండ జ్ఞానప్రకాశముComposer/Ragam: భైరవి (ఛాయ: యేసుక్రీస్తు దొరికెనని)Category: ప్రభు రాత్రి భోజనము
ప
మానవుండవై సకల నరుల – మానక నా దోషములు – బాపుటకు బలి యైతివే యేసూ – బహు ప్రేమతోడ ॥మానవుండవై॥
1.
నీదు బలిని నిత్యముగాను – నిజముగా ధ్యానించి ప్రేమను – నీదు దివ్య ప్రేమ నొందుటకు – నియమంబు నిచ్చి ॥మానవుండవై॥
2.
నీవే జీవపు రొట్టె వంటివి – నీవే జీవ జలంబు వంటివి – నిన్ను ననుభవించుకొం – టివిగా – నిజదేవా యేసూ ॥మానవుండవై॥
3.
నీ శరీరము రొట్టెవలెనే – నిజముగా విరువంగ బడెనే – నిన్ను దిన భాగ్యంబు నిచ్చితివే – నా యన్న యేసూ ॥మానవుండవై॥
4.
మంచి యూట మించి దండి – పంచగాయములలో నుండి – నిత్య జీవపు టూటలు జేసితి – నీ ప్రేమ నుండి ॥మానవుండవై॥
5.
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు – నీదు ప్రేమ బలిలో మనుటకు – నిత్య మాచరించుకొంటిమి నీ – నిజభక్తితోడ ॥మానవుండవై॥
6.
ఎంతో ప్రేమతో బలిగా నైతివి – యెంతో ప్రేమాచార మైతివి – చింతలను నా పాపములు బాప – శ్రీ యేసు దేవా ॥మానవుండవై॥
7.
నిత్యబలి యగు నిన్నే నమ్మి – నిన్ను ననుభవించి నెమ్మది – నిన్ను నిముడించుకొని నాలో నీ – నిజరూప మొందె ॥మానవుండవై॥
8.
నేను నీ బలిలోన గలిసి – నేను నీతోడ గలిసి మెలిసి – నేను నీవలె నుండ జేసితివే – నా దివ్య యేసూ ॥మానవుండవై॥
9.
నీదు శ్రమలను బలిని నిప్పుడు – నాదు కన్నులు చూడ నెప్పుడు – నాదు పాపభారములు దిగనే – నా దివ్య యేసూ ॥మానవుండవై॥
10.
నీవు బలియై తిరిగి లేచి – నిత్య తేజోరూపు దాల్చి – నిత్యమును నా బలము నున్నావే – నిజ దేవా యేసూ ॥మానవుండవై॥
11.
నీవు నీ చేతులతో నితువు – ఈ నీ బలివిందునకు వచ్చుదువు – నిన్ను నీకప్పగించితి నా యేసూ! ఎన్నడును మరువను ॥మానవుండవై॥