#260సంఘీభావము బలము
Author: మల్లెల దావీదుComposer/Ragam: ఖమాసు (ఛాయ: కొనియాడతరమే)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఎల్ల సోదరులైక్యత – వసియించుట – యెంత మేలు మనోహరము ॥ఎల్ల॥
1.
ధరణిలో నహరోను – తలనుండి దిగజారు – పరిమళ తైలంబు – వలె నద్ది తనరారు ॥ఎల్ల॥
2.
వెలయు సీయోను కొం – డలపైకి దిగివచ్చు – నల హెర్మోను మంచు – వలె నద్ది చెలవారు ॥ఎల్ల॥
3.
తరంతరం బాశీర్వా – దము నిత్య జీవంబు – స్థిరముగా నందుండ – సెలవిచ్చె దేవుండు ॥ఎల్ల॥
4.
జనక తన యాత్మకును – ఘన మహిమ మగునుగాక – మును పిప్పుడున్ యుగ – ముల కగును గా కామేన్ ॥ఎల్ల॥