#242Come Holy Spirit Heavenly Dove
Author: ఐజాక్ వాట్స్ (అను: జాన్ స్మిత్ వార్ధా)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
దైవాత్మ పరిశుద్ధుడా – ధారాళ ప్రేమను – దండిగ నిచ్చి మమ్మును దయతో దీవించుము.
2.
మా యాజ్ఞానాంధకారము ద్రవము చేయుము నీ యెక్కువైన తేజము – మా యందు పోయుము.
3.
మా దురుణంబు లెల్లను – చెదరగొట్టుము మా పాప మణచుటకై నీ శక్తి జూపుము.
4.
సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట – మమ్మాదరింపుము.