#241Gracious Spirit, Holy Ghost
Author: క్రిస్టోఫర్ వర్డ్స్ వర్త్ (అను: బెర్నార్డ్ లూకాస్)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
దివ్య పావనాత్మ, నీవీవు లన్ని మంచివి నీదు ముఖ్య దానమీ – దివ్య ప్రేమయే –
2.
ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము – మృతికన్న బలము – దివ్య ప్రేమయే –
3.
కాలజ్ఞానమంతయు – కొట్టివేయబడును – ప్రేమ నిత్యముండును – దివ్య ప్రేమయే –
4.
దృష్టిగా విశ్వాసము – మార్గముగా నిరీక్షణ – అనుభవమౌగాని – ప్రేమ నిత్యమే –
5.
విశ్వాస నిరీక్షణ – ప్రేమ లీ మూడండును – కాని శ్రేష్ఠమైనది – దివ్య ప్రేమయే –
6.
పావనాత్మ! స్తోత్రము నీకు జేయువారము – మాకు దయచేయుము – దివ్య ప్రేమయే –