FaithWalk
← Back to Library

#222Christ the Lord is Risen Today

Author: చార్లెస్ వెస్లీ (అను: జాన్ ఆబెరి)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
క్రీస్తు నేడు లేచెను క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ – మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ – భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ – పాడుడిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ. మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ – యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ – సూర్యుడుద్భవంపగ ఆ ఆ ఆ హల్లెలూయ – చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ – అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ – యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ – గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ. క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ – చావు ముల్లు ద్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ – ఎల్లరిని బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ – మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ. యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ – మేము కూడ గెలుతుము ఆ ఆ ఆ హల్లెలూయ – యేసుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ – మేము కూడ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ. భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ – యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ – మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ – నీదె నిత్య విజయము ఆ ఆ ఆ హల్లెలూయ.