#221Low in the Grave He Lay
Author: రాబర్ట్ లౌరి (అను: ఒంగోలు దావీదు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
1.
యేసు సమాధిలో పరుండియుండి
యేసు సమాధిలో పరుండియుండి – వాసిగ మూడవ – నాడు లేచెను.
2.
॥లేచెను సమాధినుండి మృత్యువుపై విజయమొంది శత్రువు నోడించి జయశాలియై – నాట్యమున్ జీవించ మధ్యవర్తియై – లేచెను! లేచెను హల్లెలూయ! లేచెను॥
3.
వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!
మృత్యుబంధంబులన్ నిత్యుండు ద్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ – జయం! జయం!