FaithWalk
Font size:
217

పాపము జయింపబడినది. చెట్టు. సమూహము.

Paapamu Jayimpabadinadi. Chettu. Samoohamu.

ఆయన యుగయుగములు జీవించుచున్నాడు


బిలహరి (ఛాయ: వీరులు పాడుడి) · త్రిపుట · కడియం గాబ్రియేలు

Bilahari (Chaya: Veerulu Paadudi) · Triputa · Kadiyan Gaabriyaelu

పల్లవి

పాపము జయింపబడినది. చెట్టు. సమూహము. హల్లెలూయయని పాడుడి – దుఃఖించకు డో – చెలియలారా వినుడి – సొలయకుండగా మీరు అలటునిటు – చూచుచుండుట యెవరిని – ఫలము లేదిక బ్రతుకు యేసు – ప్రభుని వెదకుట మృతులలో ॥హల్లెలూయ॥

చరణం 1

హల్లెలూయయని పాడుడి – యేసు ప్రభుని – వలననే గలిగె గెలుపనొందుడి – ఇలయు బరమును సఖ్యపడెనయ్యెను – గలిగె హర్షము చావు చే – సిలువ చింతలు మాని, పొందుడి – కలకాలం బగు మోదము ॥హల్లెలూయ॥

చరణం 2

హల్లెలూయయని పాడుడి – మీ భూరి చిం – తలుతీరె మది నమ్ముడి – బలహీనపు చిన్న మందా! – ప్రభుని చెంతకు మరలుము – కలుగు జీవము మిమ్ము నాయన – కరుణతో నడుపును సదా ॥హల్లెలూయ॥

చరణం 3

హల్లెలూయయని పాడుడి – సంఘము సదా – నిలిచి యుండును సుమండీ – పలు తెరంగుల రిపుల వలనను – బాధ లెన్నియు గలిగినన్ – దొలగ కేమియునన్ని యెడల – గెలిచి వర్ధిల్లుచుండును ॥హల్లెలూయ॥

చరణం 4

హల్లెలూయ యని పాడుడి – దేవుని బోధ – కుల సర్వరాష్ట్రంబుల – నెలమి మహిమకు ప్రథమ ఫలమగు – యేసు రక్షణ వార్తను – వెలుగు వలె బ్రసరింపజేయుదు – రిలను ధృతితో నేర్పుతో ॥హల్లెలూయ॥

చరణం 5

హల్లెలూయయని పాడుడి – భక్తులారా – విలపింప వద్దు సుండీ – కలుగకుండుడి సందియంబులు – గడచు కాలము శీఘ్రమే – కలుగు మీకు సమాధి మిమ్మును గౌరవింప నెమ్మది ॥హల్లెలూయ॥

చరణం 6

హల్లెలూయయని పాడుడి – గోధుమ గింజ – వలె బ్రతుకుదురు మీరు – ఇల ప్రభువు తన పంట గూర్పను – నెగుదెంచును చివరిను – దొలగజేయును గురుగులను గో – ధుమలనుండి నిజంబుగా ॥హల్లెలూయ॥