#218క్రీస్తు పునరుత్థానము
Author: బస్సన్ జోసెఫ్Composer/Ragam: ముఖారిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
యేసు లేచెను – ఆదివారమున – యేసు లేచెను – వేకువజామున – యేసు లేచెను ॥యేసు॥
1.
వేకువజామున – చీకటుండగానే – యాకాశదూతలు – వీక్షతో రాగానే ॥యేసు॥
2.
సమాధిపై రాతిన్ – స్వామి దూత లిద్దరు – సమముగా దీయను – స్వామి లేచె నహహ ॥యేసు॥
3.
మృతులలో సజీవున్ – వెదకుటాలనని – దూతలు వారితో – దాత లేడని తెలిపి ॥యేసు॥
4.
స్త్రీలు వేగ వెళ్లి – శిష్యులకు దెల్ప – చింత మారిపోయి – సందేహము తొలగ ॥యేసు॥
5.
పేతురు యోహానులు – పరుగెత్తుకొని వచ్చి – ప్రవేశించి గుహలో పరమానందమొందె ॥యేసు॥
6.
యేసు చచ్చి లేచె – యేసు శిష్యులట్లే – దోషంబులకు జచ్చి – వాసిగ లేతురండి ॥యేసు॥