←అన్ని కీర్తనలు · All SongsHymn #213 of 763
Font size:
213
చక్కగా. స్త్రీలు. ఆదరించెను.
Chakkagaa. Streelu. Aadarinchenu.
క్రీస్తు పునరుత్థాన చరిత్రము
ఆనందభైరవి · ఏక · మురారి దావీదు
Aanandabhairavi · Aeka · Muraari Daaveedu
పల్లవి
చక్కగా. స్త్రీలు. ఆదరించెను.
కొరత పైని మరణమొందిన – నజరేయుడేసు – కొరకు మిగుల వెదకుచుండిన – తరుణులారా మీ ప్రభువుండు – తిరిగి బ్రతికి నిక్కముగా – సత్వరమే పేతురాది శిష్య – సమితితోడ జెప్పుడునియె ॥మరణము॥
చరణం 1
మానితముగా మీకంటి ముందు – ప్రభువనిన యట్లు – కానబడును గలిలయమందు – గాన వెళ్ళుడంచు భాసి – తానుండు పల్కు వినుచు – దీన జనులు జడిసి మిగుల – దిగులు నొంది వణకినప్పుడు ॥మరణమునన్॥
చరణం 2
మొదట మగ్దలేనే మరియకు – గనబడెనటంచు – సుదతి చెప్పె శిష్యవరులకు – కొదువలేని సంతోషమున – గోరె తీర ప్రభుని జూడ – బదిలమైన యత్నములకు – బరగ జేసి చూచినప్పుడు ॥మరణమునన్॥
చరణం 3
అంతఃశత్రువైన మరణమును – ప్రభువు గెల్చె – సంతోషించి సన్నుతింతము – వంత లేక భక్తులారా – వాస్తవముగా మనల నిటుల – నంత్యదినము నందు లేపు – నమల దేహముల నొసంగు ॥మరణమునన్॥