#177క్రీస్తు తన శ్రమలను గూర్చి ప్రవచించుట
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ఆనందభైరవిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
యేసు శిష్యులకు – నెరుక జేసిన – భవిష్యోక్తులు వినరే
కైసరయనబడు – ఘోర ప్రాంతములను – పుణ్యుడు చేరి తన – గతి మతి దలచుచు ||యేసు||
1.
యెరూషలే మనెడి – పురమున దనకు – గలుగు దుఃఖములు
దురితాత్ములు యూ – దులు కడు బాధలు – పరచి తనను సిలువ – మను చంపుదురని ||యేసు||
2.
నీతి బోధకులకు – నాయకులు పెద్దలు – ఖ్యాతిగ నర్చకులు
అతని దననప్పుడు – హాస్యము లాడుచు – బోతరించి యుమి – వేతు రటంచును ||యేసు||
3.
మనుజ కుమారుడు – మరణమై సమా – ధి వేయంగబడును
దనరుగ మూడువ – దినమున బునరు – త్థానమై యుందు గా – దర్శన మిడుదు మీకని ||యేసు||