FaithWalk
← Back to Library

#168పాపికి క్రీస్తే ఆశ్రయము

Author: రావూరి రంగయ్యComposer/Ragam: అసావేరి (ఛాయ: ఉన్నపాటున)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
పరమ రక్షక యేసు – ప్రభువా నే నీ పాల పడితి పాలన సేయవే ధరణి జనంబులు చేయు బహువిధ – దురితములు క్షమియించి సద్గతి తెరువు జూపి తరింపజేసెడి – దొరవటంచును మరుగు జొచ్చితి ||పరమ||
1.
క్షితి ఇసుక తీరముపై కతయైన నెన్ననౌ – ఇతియౌను లెక్కింపగా కుతల జన్మంబెత్తి నేను ఈ యటు – బ్రతుకు దినముల – జేయు నఘములు – మతి దలప నిమిత్తము యూతంబులు – పతితుడను నా గతి యెరుంగను ||పరమ||
2.
పసలేని మాయా దురవ్యాసనంబులను – జెంది – దెస దప్పియున్నాడను వసుధలో దుష్టునికి లోబడి – మసలజాలని బలహీనత – గసటు కన్నులగప్పి కడు మా – నసము ధూళి విలపించెద నైతిని ||పరమ||
3.
మదితప్పి గొర్రెల – మంద బాసిన గొర్రె – చెదరి చలించినట్లు వదలకు యెప్పుడు దురాత్ములైరి స – ముదయమున పడి తిరిగి నడచితి – మదికి విశ్రమమేమియు లేమిని – హృదయ సంతాపముల సుడివడి ||పరమ||
4.
మదపు నాగము భంగి – మత్తిల్లి దుర్భావ – హృదయుడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా – యెద దృఢంబు ఇంకను యేమియు లేమిని – గదల శక్యము గాక మూల్గుచు – గొదవలకు లోనైతి ద్రోహిని ||పరమ||
5.
అమిత దురాత్ముడ – నని కడ ద్రోయక – క్షమియింపుమా కరుణచే తమిని మిక్కిలి దుర్విషయగుణ సముద్రంబులు జుట్టి పాపపు – తమము గప్పియు కలుష కానన – సమితిలో పడి శ్రమలు నొందుచు ||పరమ||