FaithWalk
← Back to Library

#169పాపికి యేసే ఆశ్రయుడు

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: శంకరాభరణముCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
1.
2. అజ్ఞాన నాశన ప్రద్యుమ్నుడవు నీవే విజ్ఞాన దాయక పరమ గురువు నీవే – యేసు నీవే ||పాపి|| 3. చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొర్రెల కాపరివి నీవే – యేసు నీవే ||పాపి|| 4. రోగిష్ఠులకు స్వస్థ ప్రదాతవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొర విను నీవే – యేసు నీవే ||పాపి|| 5. నర పుత్రులకు నీతి గరపించు నీవే కరము చాపి కష్టములు ద్రోయు నీవే – యేసు నీవే ||పాపి|| 6. శాత్రవాంతరమున మృతుడవు నీవే మైత్రి జూపగా మృత్యుంజయుడవు నీవే – యేసు నీవే ||పాపి|| 7. భవదీయ పదకంజ దాసుండ నేనే భవమగ్ను నన్ను ముక్తు జేయుము నీవే – యేసు నీవే ||పాపి||