#166పాపియెడల యేసు ప్రేమ
Author: చదలవాడ థామస్Composer/Ragam: యదుకుల కాంభోజి (ఛాయ: ధరణిలోని ధనము)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
యేసు రాజా నీదు ప్రేమ – నెంచ తరము గాదయ్యా
దోషియైన నన్ను బ్రోవ – నీ సుప్రాణ మిడితివా ||యేసు రాజా||
1.
మంచివాని కొరకు నొకడు – మరణమొందుటరుదుగా
అంచితమగు ప్రేమ చేత – మించి గాయములు ఒందినావు ||యేసు||
2.
అయ్యో మ్రానుమీద నీవు – ఇయ్యకొని మోసితివా ||యేసు||
3.
గెత్సేమనే వనములోకి – జొచ్చి తండ్రి చిత్తమై
ఇచ్చిన నా శ్రమల పాత్రన్ – బుచ్చుకొని భరించితివా ||యేసు||
4.
హస్తము, పాదము, ప్రక్కలు – మస్తకపు గాయములలో
విస్తరించి చిందె నీ ప్ర – శస్త రక్తమంతయున్ ||యేసు||
5.
కొండమీద నిన్ను జూడ – గుండె లదిరిపోవునయ్యా
నిండు ప్రేమ చేత నా వలగ – మెండూ బాధల నోర్చినావు ||యేసు రాజా||
6.
మరువలేను నీదు ప్రేమ – మరణ పర్యంతంబు నా
నరక బాధలన్ని నీవు – కొరతపై వహించినావు ||యేసు రాజా||
7.
నిన్ను దలచ నా నిరీక్షణ – యున్నతముగా నుండును
యెన్నడు నీ మహిమను నా – కన్నులార జూతునో ||యేసు రాజా||