FaithWalk
← Back to Library

#165యేసుని నిరుపమాన ప్రేమ

Author: రావూరి రంగయ్యComposer/Ragam: ఆనందభైరవిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
ఈలాటిదా యేసు ప్రేమ – నన్ను – తూలనాడక తనదు – జాలి జూపినదా ||ఈలాటిదా||
1.
ఎనలేని పాప కూపమున – నేను – తనిసి మునుగుచు నే – దరి గానక యుండన్ కనికరము బెంచి నా యందు – వేగ – కొనిపోవ నా మేలు – కొరకు ఇందు వచ్చె ||ఈలాటిదా||
2.
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను – మునిగి కుములుచు నేడు – పున గుందునప్పుడు నన్ను నీచుడని త్రోయలేక – తనదు – నెనరు నాకు గనపరచి – నీతి జూపించె ||ఈలాటిదా||
3.
నెమ్మి వర వింతైన లేక – చింత – క్రుమ్మి పొగలుచునుండ – గా నన్ను జూసి సమ్మతిని నన్ను బ్రోవ దలచి – కరము – చాచి నా చేయి పట్టి – చక్కగ బిలిచే ||ఈలాటిదా||
4.
పనికిమాలిన వాడనైన – నేను – కనపరచు నా దోష – కపట వర్తనము మనసునుంచక తాపపడక యింత – ఘనమైన రక్షణ – మును నాకు జూపె ||ఈలాటిదా||
5.
నా కోరిక లెల్ల సమయములందున్ – క్రింది – లోక వాంఛల భ్రమసి – లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ – శుభము – నా కొసంగె జీవింప – నా రక్షకుడు ||ఈలాటిదా||
6.
శోధనలు నన్ను జుట్టినప్పుడు – నీతి – బోధ నా మనసులో – బుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి – యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు ||ఈలాటిదా||