FaithWalk
← Back to Library

#127Hark! the herald Angels sing

Author: చార్లెస్ వెస్లీ (అను: జె.డి. ఫాడ్‌ఫీల్డ్)Category: సాయంతనారాధన
1.
దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి दूत పాట పాడుడి రక్షకుని స్తుతించుడి.
2.
ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందున బుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేలు ప్రభో ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా? दूत పాట పాడుడి రక్షకుని స్తుతించుడి.
3.
దావ నీతి సూర్యుడా రావె దేవపుత్రుడా నీదు రాకవలన లోక సౌఖ్యమాయెను భూనివాసులందరు మృత్యుభీతి గెలుతురు నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును दूत పాట పాడుడి రక్షకుని స్తుతించుడి.